Search This Blog

Wednesday, August 26, 2020

మరో గణిత మేధావి ఇండియా నుంచి

 ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ గా... హైదరాబాద్ యువకుడు నీలకంఠ భానుప్రకాష్

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ గా... హైదరాబాద్ యువకుడు నీలకంఠ భానుప్రకాష్....


హైదరాబాద్ కు చెందిన నీలకంఠ భాను ప్రకాష్ అరుదైన గుర్తింపును సాధించారు . ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధి అయిన ఆయన భారత దేశానికి ఘనమైన కీర్తిని తెచ్చి పెట్టారు . మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ (ఎంఎస్‌ఓ) లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలి స్వర్ణం సాధించిన హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాష్ 'వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్' టైటిల్ గెలుచుకున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌ గా 4 ప్రపంచ రికార్డులు

ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లండన్‌లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ జరిగింది.

నీలకంఠ భాను ప్రకాష్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన అరుదైన అనేక రికార్డులను దక్కించుకున్నారు . ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీలో మ్యాథమెటిక్స్ ఆనర్స్ విద్యార్థి అయిన నీలకంఠ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా మానవ కాలిక్యులేటర్‌గా 4 ప్రపంచ రికార్డులు దక్కించుకున్నారు . 50 లిమ్కా రికార్డులు ఆయన దక్కించుకున్నారంటే అతిశయోక్తి కాదు .


మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ లో స్వర్ణ పతకం


మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ లో గెలవటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు . తాను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా 4 ప్రపంచ రికార్డులు మరియు 50 లిమ్కా రికార్డులను దక్కించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు . నా మెదడు కాలిక్యులేటర్ వేగం కంటే వేగంగా లెక్కిస్తుందని ఎంత పెద్ద లెక్క అయినా చిటికెలో చెప్తానని ఆయన అన్నారు. స్కాట్ ఫ్లాన్స్ బర్గ్ మరియు శకుంతల దేవి వంటి హ్యూమన్ కంప్యూటర్స్ గా గుర్తింపు ఉన్న మాథ్స్ మ్యాస్ట్రోలు గతంలో ఇలా రికార్డులను బద్దలు కొట్టారు . ఇప్పుడు వారి సరసన నీలకంఠ చేరారు.




13 దేశాలతో పోటీలో ప్రధమ స్థానం


ఎంఎస్‌ఓలో భారత్‌కు బంగారు పతకం సాధించిన నీలకంఠ దేశ కీర్తిని ఇనుమడింపజేశారు . ఆయన అభిప్రాయం ప్రకారం భౌతిక క్రీడల రంగంలో జరిగే ఇతర ఒలింపిక్ ఈవెంట్‌లకు మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సమానం అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 30 మంది మాథ్స్ మ్యాస్ట్రో లతో ఈ ఈవెంట్ జరిగింది. మానసిక నైపుణ్యం మరియు మైండ్ స్పోర్ట్స్ ఆటల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పోటీలలో ఇది ఒకటి, యుకె, జర్మనీ, యుఎఇ, ఫ్రాన్స్ గ్రీస్ మరియు లెబనాన్లతో సహా 13 దేశాల నుండి 57 సంవత్సరాల వయస్సు ఉన్నవారు వరకు పాల్గొన్నారు .




కాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కలు .. హైదరాబాదీ అపూర్వ ప్రతిభ


ఈ పోటీలో 65 పాయింట్లతో అగ్రస్థానంలో నీలకంఠ , రెండవ స్థానంలో లెబనీస్ పోటీదారు, మూడో స్థానంలో యుఏఈ పోటీదారు ఉన్నారు. న్యాయమూర్తులు అతని వేగంతో ఆశ్చర్యపోయారు . అతను చెప్పే లెక్కల కచ్చితత్వాన్ని నిర్ధారించటానికి వారు లెక్కలు చెయ్యటానికి సమయం పట్టింది. కానీ నీలకంఠ మాత్రం కచ్చితంగా కాలిక్యులేటర్ కంటే చాలా వేగంగా సమాధానాలు చెప్పేశారు . ఇప్పుడు భారతదేశాన్ని ప్రపంచ స్థాయి గణితంలో ముందు వరుసలో ఉంచడానికి నా వంతు కృషి చేస్తానని నీలకంఠ భాను ప్రకాష్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన నీలకంఠ అపూర్వ ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు .

1 comment: